Red Sandal: కావాలనే నన్ను కేసుల్లో ఇరికించారు: జబర్దస్త్ హరి

  • ఒక్కసారి మాత్రమే స్మగ్లింగ్ చేశాను
  • ఓ కానిస్టేబుల్ ను పట్టించడంతోనే తప్పుడు కేసులు పెట్టారు
  • ఐజీ ఎదుట లొంగిపోయిన తరువాత హరి
ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేసి కోట్లు గడించి సినిమాల్లో పెట్టుబడిగా పెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జబర్దస్త్ నటుడు శ్రీహరి, పోలీసులకు లొంగిపోయిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, తనను ఓ కానిస్టేబుల్ కావాలనే ఈ కేసులో ఇరికించాడని ఆరోపించారు. గతంలో తన పరిస్థితి బాగాలేక ఒకే ఒక్కసారి ఎర్రచందనం స్మగ్లింగ్ చేశానని, ఆ తరువాత ఎన్నడూ ఆ పని చేయలేదని చెప్పాడు.

ఓ పోలీస్ కానిస్టేబుల్ ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తుంటే, తాను పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి పట్టించానని, ఆ కోపంతో తనపై పగను పెంచుకున్న కానిస్టేబుల్ తనపై అనేక తప్పుడు కేసులు పెట్టి ఇరికించాడని చెప్పాడు. కాగా, హరి ఇటీవల షకలక శంకర్ హీరోగా నటించిన 'శంభోశంకర' చిత్రానికి ఫైనాన్స్ చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా అతని కోసం గాలిస్తుండగా, తన న్యాయవాదితో పాటు వచ్చిన హరి, తిరుపతి టాస్క్ ఫోర్స్ ఐజీ కాంతారావు ఎదుట లొంగిపోయాడు.
Red Sandal
Jabardast Hari
Arrest
Tirupati

More Telugu News