Keerthi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • డబ్బు కోసం కాదంటున్న కీర్తి!'
  • గూఢచారి'ని కొనేసిన ప్రముఖ నిర్మాత 
  • 'హ్యాపీ వెడ్డింగ్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడి 
  • బాలీవుడ్ కి వెళుతున్న 'ఆర్ఎక్స్ 100'    

*  తాను డబ్బు సంపాదించడం కోసం సినిమాల్లోకి రాలేదని అంటోంది కథానాయిక కీర్తి సురేశ్. 'నటిగా పేరు తెచ్చుకోవాలని సినిమాల్లోకి వచ్చాను. అంతేకానీ, డబ్బు కోసం మాత్రం కాదు. అందుకే స్క్రిప్టుకే ప్రాధాన్యత ఇస్తాను' అని చెప్పింది. ఇటీవల తన పారితోషికాన్ని ఈ చిన్నది భారీగా పెంచేసిందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆమె అలా స్పందించింది.
*  అడవి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న 'గూఢచారి' చిత్రం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర మంచి రేటుకి సొంతం చేసుకున్నారు. ఆగస్టు 3న విడుదల కానున్న ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటించింది.    
*  సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటించిన 'హ్యాపీ వెడ్డింగ్స్' చిత్రం ఈ నెల 28న విడుదల అవుతోంది. ఈ క్రమంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 21న హైదరాబాదులో ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఎక్స్ 100' చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. దీంతో ఈ చిత్రం హిందీ రీమేక్ హక్కుల కోసం పోటీ ఏర్పడింది. పలు చిత్ర నిర్మాణ సంస్థలు హక్కుల కోసం పోటీ పడుతున్నాయి.

More Telugu News