తిరుమల ఆలయం మూసివేత వెనుక కుట్ర: శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అనుమానం!
- సీసీ కెమెరాలు ఆపివేయడం ఏంటి?
- మహా సంప్రోక్షణను భక్తులు తిలకించవచ్చు
- భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి
- విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి
ఆగమశాస్త్రం ప్రకారం మహా సంప్రోక్షణ యావత్తూ భక్తులు తిలకించవచ్చని గుర్తు చేసిన ఆయన, ఆలయం మూసివేత నిర్ణయం తీసుకునే ముందు కంచి, శృంగేరి వంటి పీఠాలతో సంప్రదించారా? అని ప్రశ్నించారు. తిరుమల వ్యవహారాలు భక్తుల్లో అనుమానాలను పెంచుతున్నాయని, ఇప్పటికైనా ఆగమ పండితుల సలహాలు తీసుకుని, దాని ప్రకారం ముందుకెళ్లాలని సలహా ఇచ్చారు.