Kathi Mahesh: కత్తి మహేశ్ అరెస్ట్.. పీలేరు పోలీసుల అదుపులో సినీ విమర్శకుడు

  • ఎమ్మార్పీఎస్ కార్యక్రమంలో కనిపించిన కత్తి
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • బెంగళూరుకు తరలింపు
శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నగర బహిష్కరణకు గురై చిత్తూరు చేరుకున్న సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను పీలేరు పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత మదనపల్లెకు తరలించిన పోలీసులు అక్కడి నుంచి బెంగళూరుకు తరలిస్తున్నట్టు సమాచారం.

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను హైదరాబాద్ పోలీసులు ఇటీవల కత్తి మహేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆరు నెలల పాటు నగరం నుంచి బహిష్కరించారు. అనంతరం అతడి స్వస్థలమైన చిత్తూరు జిల్లాలోని యల్లమంద గ్రామంకు తీసుకెళ్లి వదిలిపెట్టారు.

సోమవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అకస్మాత్తుగా కత్తి ప్రత్యక్షమయ్యాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని మదనపల్లెకు, అక్కడి నుంచి బెంగళూరుకు తరలించారు. కత్తి కనుక మీడియా సమావేశం పెడితే శాంతిభద్రతలు అదుపు తప్పుతాయనే ఉద్దేశంతోనే అతడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Kathi Mahesh
Chittoor District
Arrest

More Telugu News