Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'దటీజ్ మహాలక్ష్మి' పారిస్ షెడ్యూల్ పూర్తి  
  • బాలకృష్ణ, బోయపాటి సినిమాకి ముహూర్తం 
  • నిఖిల్ 'ముద్ర'  కోసం రొమాంటిక్ సీన్స్ 
  • సెన్సార్ పూర్తి చేసుకున్న 'లవర్స్'

*  హిందీ హిట్ చిత్రం 'క్వీన్'ను దక్షిణాది భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ (దటీజ్ మహాలక్ష్మి)లో తమన్నా, తమిళ వెర్షన్ (పారిస్ పారిస్)లో కాజల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కాగా, తాజాగా ఈ చిత్రం పారిస్ షెడ్యూల్ ముగిసింది. దీంతో షూటింగ్ దాదాపు పూర్తయింది.
*  బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో రూపొందే చిత్రం షూటింగును అక్టోబర్ 10న ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
*  నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న 'ముద్ర' చిత్రం రెండో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ప్రస్తుతం హీరో హీరోయిన్లపై రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తమిళంలో హిట్టయిన 'కనిథన్' చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆ చిత్ర దర్శకుడు టీఎన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నాడు.
*  రాజ్ తరుణ్ హీరోగా అనిష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన 'లవర్స్' చిత్రం సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ పొందింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేస్తున్నారు.

  • Loading...

More Telugu News