kalyan dev: ఆరోగ్యం బాగోలేకపోయినా ఆయన అద్భుతంగా చేశారు: 'విజేత' దర్శకుడు రాకేశ్ శశి

  • అది చాలా కీలకమైన సీన్ 
  • సమయం కూడా పెద్దగా లేదు
  • హాస్పిటల్ నుంచి అయన నేరుగా వచ్చాడు

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా దర్శకుడు రాకేశ్ శశి 'విజేత' సినిమాను తెరకెక్కించాడు. ఇటీవల థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా, అన్నివర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా రాకేశ్ శశి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు.

"ఈ సినిమా క్లైమాక్స్ కి సంబంధించిన ఒక సన్నివేశాన్ని మురళీశర్మపై చిత్రీకరించవలసి వుంది. అప్పటికి ఆయనకి ఆరోగ్యం బాగోలేదు. షూటింగు రోజు ఉదయం హాస్పిటల్ నుంచి నేరుగా ఆయన లొకేషన్ కి వచ్చారు. ఆరోగ్యం బాగోలేకపోవడం వలన ఆయన కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవలసి వుంది .. అయినా ఆయన షూటింగుకి వచ్చేశారు. ఒక వైపున సమయం లేదు .. మరో వైపున ఆయన ఆరోగ్యం బాగోలేదు .. తీయవలసినది చాలా కీలకమైన సన్నివేశం. మురళీ శర్మ గారు ముందుగానే డైలాగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసి ఉండటం వలన అద్భుతంగా చేశారు .. సింగిల్ టేక్ లో ఓకే అయిపోయింది" అని చెప్పుకొచ్చాడు. 

  • Loading...

More Telugu News