nalgonda: నల్గొండకు చెందిన వ్యక్తే సీఎం అవుతారు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
  • కాంగ్రెస్ నేతలంతా ఒక్కటైతే కేసీఆర్ పరారే
  • కష్టపడే వ్యక్తులకే రాహుల్ అవకాశమిస్తారు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తే సీఎం అవుతారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేలా చేసిన సోనియా రుణాన్ని తీర్చుకునే సమయం వచ్చిందని, కాంగ్రెస్ నేతల మధ్య గ్రూప్ తగాదాలు ఉంటే కేసీఆర్ బలపడతారని, అందరం ఒక్కటైతే, కేసీఆర్ పరార్ అవడం ఖాయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే టికెట్ అడిగే అవకాశం ఉందని, కష్టపడే వ్యక్తులకే రాహుల్ అవకాశం ఇస్తారని, కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే ఫలితం ఉంటుందని, ఎవరైనా సీఎం కావచ్చని అన్నారు. టీఆర్ఎస్ లో మాత్రం కేసీఆర్ కుటుంబానికి తప్ప మరెవరికీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని విమర్శించారు. సోనియాగాంధీపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు సబబు కాదని అన్నారు.
nalgonda
komati reddy

More Telugu News