Chandrababu: చంద్రబాబు సీఎంగా ఉన్నంతవరకు ఏపీ అన్నపూర్ణ కాలేదు: వైసీపీ నేత పార్థసారథి

  • చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది
  • 1500 రోజుల పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదు
  •  కేంద్రంతో బాబు లాలూచీ పడ్డారు
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు 1500 రోజుల పాలనలో అవినీతి, అన్యాయం, అరాచకం తప్ప అభివృద్ధి కనిపించడం లేదని ఆరోపించారు. 1500 రోజుల పాలనపై గొప్పగా పత్రికా ప్రకటనలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు.

ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్నంత వరకూ ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ కాలేదని, బాబు పాలనలో అభూత కల్పనలు, అబద్ధాలు ప్రచారం చేశారని అన్నారు. కేంద్రంతో చంద్రబాబు లాలూచీ పడి ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటే తాను, తన కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకుంటామని అన్నారు. జగన్ మాటపై తమకు ఎంతో నమ్మకం ఉందని, మరి, టీడీపీ నేతలకు చంద్రబాబుపై నమ్మకం ఉందా? అని ప్రశ్నించారు.
Chandrababu
partha sarathy

More Telugu News