kanna: ఏపీలో ఇంతదారుణమైన పాలనను ఎన్నడూ చూడలేదు: కేంద్రమంత్రులకు కన్నా ఫిర్యాదు

  • బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు తగదు
  • ఏపీలో శాంతి భద్రతలు అదుపులో లేవు
  • రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ కు కన్నా ఫిర్యాదు
ఏపీలో బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ కు కన్నా లక్ష్మీ నారాయణ ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో వారిని ఈరోజు కలిశారు. అనంతరం, కన్నా మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో శాంతి భద్రతలు అదుపులో లేవని ఫిర్యాదు చేశానని, ప్రశ్నిస్తే వేధిస్తున్నారని, కావాలనే తమ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారనే విషయాన్ని వారికి చెప్పానని అన్నారు.

కేంద్రంపై చంద్రబాబునాయుడు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్న తనపై కావాలనే దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని, భౌతికదాడులు జరుగుతున్న విషయాన్ని మంత్రులకు చెప్పానని అన్నారు. ఇంత దారుణమైన పాలనను ఎన్నడూ చూడలేదని, కేంద్రంపై అవిశ్వాసతీర్మానం పెడతామంటూ టీడీపీ మరోసారి హైడ్రామాకు తెరతీస్తోందని విమర్శించారు. 
kanna
rajnath
nirmala sitaraman

More Telugu News