dvv danayya: రెమ్యునరేషన్ చెల్లించలేదని చెప్పడం అవాస్తవం: 'భరత్ అనే నేను' నిర్మాత దానయ్య

  • కొరటాల శివ, కైరా అద్వానీలకు డబ్బు చెల్లించలేదనే వార్తలు
  • ఆ వార్తలు అవాస్తవాలన్న దానయ్య
  • తమ ఆఫీస్ కు వచ్చి చెక్ చేసుకోవచ్చన్న నిర్మాత
మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'భరత్ అనే నేను' చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. అయితే, సినిమా కోసం పని చేసిన కొందరికి దానయ్య రెమ్యునరేషన్ చెల్లించలేదనే వార్తలు వెలువడ్డాయి. కొరటాల శివ, హీరోయిన్ కైరా అద్వానీలకు ఆయన పూర్తి రెమ్యునరేషన్ చెల్లించలేదనే వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.

దీనిపై దానయ్య స్పందిస్తూ, ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని చెప్పారు. ఈ చిత్రం కోసం పని చేసిన నటీనటులు, టెక్నీషియన్లందరికీ పారితోషికాలు చెల్లించామని తెలిపారు. ఎవరికైనా అనుమానాలు ఉంటే హైదరాబాదులో ఉన్న తమ కార్యాలయానికి వచ్చి చెక్ చేసుకోవచ్చని, లేదా తమ సినిమాలో పని చేసిన నటీనటులను అడిగి తెలుసుకోవచ్చని చెప్పారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రసారం చేయవద్దని జర్నలిస్టులను కోరుతున్నానని తెలిపారు.
dvv danayya
Koratala Siva
kiara
remuneration
Bharath Ane Nenu
tollywood

More Telugu News