Football: మీడియా సమావేశంలో చొక్కాలిప్పి, మందుతాగుతూ గెంతులేసిన ఫ్రాన్స్ ఆటగాళ్ల వీడియో!

  • మితిమీరిన ఆటగాళ్ల సంబరం
  • మీడియా సమావేశంలో షాంపైన్ తో గంతులు
  • నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

క్రొయేషియాపై విజయం సాధించి సాకర్ ప్రపంచ కప్ ను గెలుచుకున్న ఫ్రాన్స్ ఆటగాళ్ల సంబరం మితిమీరింది. మ్యాచ్ తరువాత మీడియా సమావేశానికి వచ్చిన జట్టు, మీడియా ముందు మందేసి చిందేశారు. ఫ్రాన్స్ జట్టు కోచ్ డిడియర్ డెషాంప్స్ ప్రసంగించేందుకు సిద్ధం కాగా, ఆటగాళ్లు ఒకరిపై ఒకరు షాంపైన్ చల్లుకుంటూ సందడి చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన టేబుళ్లు ఎక్కి గంతులేశారు. చొక్కాలు విప్పేసి చిందులేశారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.

కాగా, 1998లో ప్రస్తుత కోచ్ డెషాంప్స్ కెప్టెన్ గా కప్పు గెలిచిన ఫ్రాన్స్, ఇప్పుడు రెండోసారి విశ్వ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇలా ఒక దేశపు ఫుట్ బాల్ జట్టుకు కెప్టెన్ గా, ఆపై అదే జట్టుకు కోచ్ గా వ్యవహరించి కప్ ను అందుకున్న మూడో వ్యక్తి డెషాంప్స్. ఆటగాళ్ల చిందుల వీడియోను మీరూ చూడండి!

More Telugu News