Warangal Urban District: వరంగల్ విద్యార్థి శరత్ హంతకుడిని మట్టుబెట్టిన అమెరికా పోలీసులు

  • ఈనెల నాలుగున శరత్ హత్య
  • ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లిన శరత్
  • ఎన్ కౌంటర్ లో ముగ్గురు పోలీసులకు గాయాలు
ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి, ఈనెల 4వ తేదీన ఓ స్టోర్ లో జరిగిన కాల్పుల్లో అసువులు బాసిన కొప్పు శరత్ హంతకుడిని అమెరికా పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపారు. వివరాల్లోకి వెళితే, శరత్ పై కాల్పులకు దిగిన దుండగుడిని గుర్తించిన మిస్సోరీ పోలీసులు, కెన్సాస్ సిటీ శివార్లలో అతనున్న ప్రాంతానికి వెళ్లారు. అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు.

అయితే, లొంగిపోవాలన్న పోలీసుల హెచ్చరికలను ఖాతరు చేయని ఆ హంతకుడు, పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలు అయ్యాయి. పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించడంతో అతను మరణించాడు. ఈ విషయాన్ని వెల్లడించిన కెన్సాస్ సిటీ పోలీస్ చీఫ్ రిక్ స్మిత్, నిందితుడు తన వద్ద ఉన్న రైఫిల్ తో కాల్పులు జరిపాడని, దాంతో పోలీసులు ఎదురు కాల్పులకు దిగడంతో అతను మరణించాడని చెప్పారు. ఈ ఎన్ కౌంటర్ లో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని తెలిపారు.
Warangal Urban District
Sarat Koppu
Kansas City Police
Encounter

More Telugu News