Egg: పక్షి గుడ్డు పగలగొట్టిన చిన్నారి.. ఘోరమైన శిక్ష విధించిన పంచాయతీ

  • పది రోజులు ఇంట్లోకి వెళ్లకూడదంటూ శిక్ష
  • ఇంట్లో వాళ్లు కూడా ముట్టుకోకూడదని తీర్పు
  • పంచాయతీ పెద్దల అరెస్ట్
పరమ పవిత్రంగా భావించే పక్షి గుడ్డును పగల గొట్టిందన్న కారణంతో ఐదేళ్ల చిన్నారికి స్థానిక పంచాయతీ ఘోరమైన శిక్ష విధించింది. సంచలనంగా మారిన ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. ఈనెల 2న హరిపుర గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకోగా తాజాగా తీర్పు చెప్పిన పంచాయతీ పెద్దలను పోలీసులు అరెస్ట్ చేశారు .

హరిపురం గ్రామంలో మధ్యాహ్న భోజన సమయంలో బాలిక తనకు తెలియకుండానే ఓ గుడ్డును పగలగొట్టింది. ఇది గ్రామస్తుల ఆగ్రహానికి కోపమైంది. అది ఎంతో పవిత్రంగా భావించే పక్షి గుడ్డు కావడంతో పంచాయతీ పెద్దలు సమావేశమయ్యారు. చేసిన తప్పుకు బాలిక తన ఇంట్లోకి పది రోజులపాటు వెళ్లకూడదని తీర్పు చెప్పారు. అంతేకాదు, కుటుంబ సభ్యులెవరూ ఆమెను తాకరాదని హెచ్చరించారు. విషయం బయటకు రావడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు తీర్పు చెప్పిన పెద్దలను అరెస్ట్ చేశారు.
Egg
Rajasthan
Girl
arrest

More Telugu News