Karuna nidhi: శ్రీకృష్ణుడు-కరుణానిధి సేమ్ టు సేమ్... కరుణానిధే కొంచెం ఎక్కువ గొప్ప: ఎం.రాజా

  • శ్రీకృష్ణుడి మూలరూపాన్ని సహదేవుడు గుర్తించాడు
  • కరుణానిధి విషయంలో అది అసాధ్యం
  • సెలవిచ్చిన కేంద్ర మాజీ మంత్రి
డీఎంకే చీఫ్ కరుణానిధిని కేంద్ర మాజీ మంత్రి ఎం. రాజా ఆకాశానికెత్తేశారు. సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్ముడి కంటే కూడా ఆయనే గొప్పోడని తేల్చిచెప్పారు. తన మూల రూపాన్ని గుర్తించాలంటూ శ్రీకృష్ణుడు విశ్వరూపం దాల్చి పాండవులకు పరీక్ష పెట్టాడని పేర్కొన్న రాజా.. ఒక్క సహదేవుడు మాత్రమే ఆయన మూల రూపాన్ని గుర్తించాడని చెప్పారు.

ఇప్పుడు కరుణాధి కూడా సేమ్ టు సేమ్ అంతేనని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే కృష్ణుడి కంటే కొంచెం ఎక్కువేనని సెలవిచ్చారు. కరుణానిధి మూలరూపాన్ని గుర్తించేందుకు పలువురు పలు రకాల రూపాలను పట్టుకుంటున్నారని అన్నారు. అధిక పాలనా సామర్థ్యం ఉన్న కరుణానిధి.. శ్రీకృష్ణుడి కంటే గొప్పవారని, ఆయన మూల రూపాన్ని గుర్తించడం అసాధ్యమని మాజీ మంత్రి తేల్చి చెప్పారు.
Karuna nidhi
M.Raja
Lord Srikrishna

More Telugu News