karthikeya: 'ఆర్ ఎక్స్ 100' హీరోయిన్ పారితోషికం ఇంతేనా?

  • కార్తికేయ కథానాయకుడిగా 'ఆర్ ఎక్స్ 100'
  • యూత్ నుంచి మంచి మార్కులు 
  • పాయల్ రాజ్ పుత్ కి పెరిగిన క్రేజ్  

అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ .. పాయల్ రాజ్ పుత్ జంటగా 'ఆర్ ఎక్స్ 100' సినిమా తెరకెక్కింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా విజయవిహారం చేస్తోంది. ఈ సినిమాకిగాను పాయల్ రాజ్ పుత్ తీసుకున్న పారితోషికం గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. 'ఆర్ ఎక్స్ 100' సినిమాలో యాక్షన్ తో పాటు రొమాన్స్ పాళ్లు ఎక్కువే. ఈ సినిమాలో లిప్ లాక్ లు చాలానే వుంటాయని దర్శకుడు ముందుగానే చెప్పడం వలన, చాలామంది కథానాయికలు ఈ ఆఫర్ ను తిరస్కరించారు.

 ఒకానొక సమయంలో హీరోయిన్ దొరకడం కష్టమే అనే స్థితికి వచ్చేశారట. అలాంటి పరిస్థితుల్లో పాయల్ రాజ్ పుత్ ప్రస్తావన రావడం .. ఆమె అంగీకరించడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమాలోని రొమాంటిక్ సీన్స్ చూసిన వాళ్లు .. అందుకు తగినట్టుగా ఆమె బాగానే డిమాండ్ చేసి ఉంటుందని అనుకోవడం సహజం. కానీ పారితోషికంగా ఆమెకి ముట్టినది కేవలం 6 లక్షలేననే మాట ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ విషయం గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. పారితోషికం కన్నా ఆ తరువాత వచ్చే ఛాన్సులపై ఆమె దృష్టి పెట్టి వుంటుందని చెప్పుకుంటున్నారు. 

More Telugu News