samanta: సమంత మంచి మనసుకు మరో నిదర్శనం!

  • ఒక వైపున వరుస సినిమాలు 
  • మరో వైపున సామాజిక సేవ 
  • చిన్నారుల జీవితాల్లో వెలుగులు

తెలుగు .. తమిళ భాషల్లో సమంత అగ్రకథానాయికగా వెలుగొందుతోంది. ఈ రెండు భాషల్లోను ఆమెకి ఎంతోమంది అభిమానులు వున్నారు. నటన విషయంలోనే కాదు .. వ్యక్తిత్వం విషయంలోను ఆమెను వాళ్లంతా ఎంతగానో అభిమానిస్తుంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సమాజ సేవ కోసం ఆమె సమయాన్ని కేటాయిస్తూనే వుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలంటే సమంతకు చాలా ఇష్టం .. అనారోగ్యంతో బాధపడుతోన్న పిల్లలకు 'ప్రత్యూష ఫౌండేషన్' ద్వారా శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు.

 అలా చాలామంది చిన్నారుల జీవితంలో ఆమె వెలుగులు నింపుతూ వస్తున్నారు. తాజాగా ఆమె 70 యేళ్ల చరిత్ర కలిగిన 'ఫోనాక్' అనే సంస్థకి వచ్చారు. వినికిడి లోపంతో బాధపడుతోన్న చిన్నారుల సమస్యలను తీర్చే ఈ సంస్థకి తెలుగు రాష్ట్రాల్లో 36 శాఖలున్నాయి. నిన్న ఈ సంస్థకి వెళ్లిన సమంత .. వినికిడి లోపంతో బాధపడుతోన్న పది మంది చిన్నారులకు వినికిడి యంత్రాలను అందించారు. భవిష్యత్తులోను ఈ సంస్థకి తన వంతు సాయం అందుతుందని ఈ సందర్భంగా ఆమె చెప్పారు.    

  • Loading...

More Telugu News