Tollywood: టాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ కన్నుమూత.. విషాదంలో తెలుగు చిత్రపరిశ్రమ

  • 300కుపైగా సినిమాల్లో నటించిన వినోద్
  • ఫ్యాక్షన్ సినిమాల్లో విలన్‌గా మెప్పించిన నటుడు
  • బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి
ఇంద్ర, చంటి, నరసింహనాయుడు, లారీ డ్రైవర్, మిర్చి తదితర సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు వినోద్ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. 300కు పైగా సినిమాల్లో నటించిన ఆయన తెల్లవారుజామున రెండు గంటల సమయంలో బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చిరపరిచితుడైన వినోద్ పలు సీరియళ్లలోనూ నటించారు. బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. వినోద్ అసలు పేరు అరిశెట్టి నాగేశ్వరరావు. ఫ్యాక్షన్ సినిమాల్లో విలన్‌గా నటించి పేరు తెచ్చుకున్న ఆయన మృతి విషయం తెలిసి చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
Tollywood
Actor
vinod
Dead

More Telugu News