paripoornananda: వాల్మీకిగా మారగల శక్తి ఉన్నవాడు కత్తి మహేష్!: స్వామి పరిపూర్ణానంద

  • బోయవాడిలా మాట్లాడిన మహేష్.. వాల్మీకిగా మారగలడు
  • భారతీయ సంస్కృతిని ప్రభుత్వాలు కాపాడాలి
  • హిందూ సంప్రదాయాలు తెలిసేలా విద్యా వ్యవస్థను తయారు చేయాలి
సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై నిన్నటి వరకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్వామి పరిపూర్ణానంద ఇప్పుడు శాంతించారు. కత్తి మహేష్ ను తాను మనస్పూర్తిగా క్షమిస్తున్నానని చెప్పారు. ఒక బోయవాడిలా మహేష్ మాట్లాడినా... వాల్మీకిలా మారగల శక్తి ఆయనకు ఉందని అన్నారు. భారతీయ సంస్కృతిని కాపాడాల్సింది ప్రభుత్వాలేనని చెప్పారు. విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందని... హిందూ సంప్రదాయాలు, విలువలు తెలిసేలా విద్యావ్యవస్థను తయారు చేయాలని సూచించారు. రామ నామం విలువను ప్రతి ఒక్కరూ తెలుకోవాలని అన్నారు.

రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ ను హైదరాబాదు నుంచి ఆరు నెలల పాటు బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఓ సభలో రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారంటూ పరిపూర్ణానందను కూడా నగరం నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత పరిపూర్ణానందకు నగర బహిష్కరణ విధించడాన్ని కత్తి మహేష్ ఖండించారు. బహిష్కరణలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఆ తర్వాత పరిపూర్ణానంద మాట్లాడుతూ, కత్తి మహేష్ ను బహిష్కరించడం సరికాదని చెప్పారు. 
paripoornananda
kathi mahesh
valmiki

More Telugu News