Rahul Gandhi: మీ సంగతి నేను చూసుకుంటాను... అంతా కలసి నడవండి!: నల్లారికి రాహుల్ భరోసా

  • మువ్వన్నెల కండువా కప్పి ఆహ్వానించిన రాహుల్
  • సముచిత స్థానం ఇస్తామని హామీ
  • మధ్యవర్తిగా వ్యవహరించిన పళ్లంరాజు

ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలో రాహుల్ గాంధీ ఆయనకు మువ్వన్నెల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన రాహుల్ తన నివాసానికి రాగా, కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కేంద్ర మాజీ మంత్రి పళ్ళంరాజు, ఏపీ వ్యవహారాల ఇన్ చార్జ్ ఊమెన్ చాందీ, పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వచ్చారు.

ఆపై కిరణ్ తో సమావేశమైన రాహుల్, నేతలంతా కలసి ఎన్నికల్లో విజయం దిశగా కలసి పనిచేయాలని సూచించారు. పార్టీలో సముచిత స్థానం ఇచ్చే విషయాన్ని తాను చూసుకుంటానని అన్నారు. కాగా, కిరణ్ చేరికతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు లాభం చేకూరుతుందని, విభజన సమయంలో పార్టీని వీడిన పలువురు నేతలను తిరిగి వెనక్కు తీసుకు రావచ్చని అధిష్ఠానం భావిస్తోంది.

కాగా, కాంగ్రెస్ లోకి తిరిగి రావాలంటే రాహుల్ ఆహ్వానించాలని పళ్లంరాజుతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పగా, అదే విషయాన్ని రాహుల్ కు చేరవేసిన పళ్లంరాజు, ఆయనతోనే కిరణ్ ను ఆహ్వానించేలా చూశారని తెలుస్తోంది.

More Telugu News