mehabooba mufti: పీడీపీని ముక్కలు చేయాలనుకుంటే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: బీజేపీని హెచ్చరించిన మెహబూబా ముఫ్తీ

  • మా పార్టీ జోలికి వస్తే చూస్తూ ఊరుకోం
  • ప్రజాస్వామ్య వ్యవస్థపై కశ్మీర్ ప్రజలకు నమ్మకం పోతుంది
  • బీజేపీకి వార్నింగ్ ఇచ్చిన మెహబూబా ముఫ్తీ

పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని ఆ పార్టీ అధినేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీని ముక్కలు చేసేందుకు యత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పీడీపీతో కలసి జమ్ముకశ్మీర్ లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ... ఇటీవలే ఆ పార్టీకి మద్దతు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.

 ప్రస్తుతం అక్కడ గవర్నర్ పాలన కొనసాగుతోంది. మరోవైపు, పీడీపీలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలను తమవైపు లాక్కుని, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే మెహబూబా ముఫ్తీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీడీపీలో చీలిక తెచ్చేందుకు బీజేపీ యత్నిస్తే... భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై కశ్మీర్ ప్రజలకు నమ్మకం పోతుందని మెహబూబా అన్నారు.  

More Telugu News