saidharam tej: మెగా హీరోతో నా సినిమా వుంది: దర్శకుడు గోపీచంద్ మలినేని

  • థియేటర్లలో 'తేజ్ ఐ లవ్ యూ'
  • కిషోర్ తిరుమలతో తేజు 
  • కొత్త దర్శకుడు గోపాల్ కి ఛాన్స్
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఒక సినిమా చేయనున్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈలోగా సాయిధరమ్ తేజ్ .. వినాయక్ తోను .. కరుణాకరన్ తోను సినిమాలు చేసేశాడు. నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేనితో వుంటుందనే అంతా అనుకున్నారు. కానీ కిషోర్ తిరుమలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, గోపాల్ అనే కొత్త దర్శకుడికి తాజాగా ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. దాంతో గోపీచంద్ మలినేనితో సాయిధరమ్ తేజ్ సినిమా లేనట్టేననే వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోపీచంద్ మలినేని స్పందిస్తూ .. " సాయిధరమ్ తేజ్ తో నా సినిమా ఉండదన్నట్టుగా వస్తోన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. సాయిధరమ్ తేజ్ తో నా సినిమా వుంది .. అందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తాను" అని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'విన్నర్' సరిగ్గా ఆడలేదనే సంగతి తెలిసిందే.  
saidharam tej
gopichand malineni

More Telugu News