trisha: ఆసక్తిని రేపుతోన్న త్రిష '96' టీజర్

  • త్రిష ప్రధాన పాత్రగా '96'
  • కీలకపాత్రలో విజయ్ సేతుపతి 
  • దర్శకుడిగా ప్రేమ్ కుమార్    

తమిళంలో త్రిష ప్రధానమైన పాత్రగా '96' చిత్రం రూపొందింది. త్రిష జోడీగా విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమాకి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఇదే పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండగా కేవలం ఒక సాంగ్ బిట్ పై ఈ టీజర్ ను కట్ చేశారు. ప్రేమభావన .. ఆనందం .. ఆవేదనకి సంబంధించిన సన్నివేశాలతో ఈ టీజర్ ను వదిలారు. త్రిష గతంలో కంటే అందంగా కనిపిస్తోంది. ఫొటోగ్రఫీ చాలా బాగుందనే విషయం టీజర్ ను బట్టి అర్థమైపోతోంది. మద్రాస్ ఎంటర్ ప్రైజస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాపై ఈ టీజర్ తో అంచనాలు పెరుగుతాయనే చెప్పాలి.

  • Loading...

More Telugu News