nitin gadkari: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర సర్కారులకు చిత్తశుద్ధి ఉందా?: బొత్స

  • పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో ఆలస్యం జరుగుతోంది
  • పట్టిసీమ ప్రాజెక్టు కోసం పోలవరాన్ని పక్కనబెట్టారు
  • డీపీఆర్‌లలో ఎందుకు వ్యత్యాసాలు వస్తున్నాయి?
  • ప్రాజెక్టు పనుల్లో అక్రమాలు జరిగాయి
పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో ఆలస్యం జరుగుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. నిన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి ఆ ప్రాజెక్టు పనులను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పరిశీలించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ హైదరాబాద్ లోని తమ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... పట్టిసీమ ప్రాజెక్టు కోసం పోలవరాన్ని పక్కనబెట్టారని, ఆ ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర సర్కారులకు చిత్తశుద్ధి ఉందా? అని నిలదీశారు. డీపీఆర్‌లలో ఎందుకు వ్యత్యాసాలు వస్తున్నాయని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అక్రమాలు జరిగిన విషయం నితిన్‌ గడ్కరీ పర్యటనలో బహిర్గతమైందని ఆయన అన్నారు.  
nitin gadkari
polavaram
Botsa Satyanarayana

More Telugu News