jc diwakar reddy: త్వరలోనే రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నా: జేసీ దివాకర్ రెడ్డి
- కుమారుడికి లైన్ క్లియర్ చేస్తున్న జేసీ
- వచ్చే ఎన్నికల్లో రంగంలోకి పవన్ రెడ్డి
- స్విట్జర్లాండ్, జెనీవాల్లో చదువుకున్న పవన్
ఎప్పుడూ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే తాను రాజకీయాలకు గుడ్ బై చెపుతానని ప్రకటించారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అనంతపురంలో టీడీపీ ఎంపీలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తన మనసులోని మాటను వెల్లడించారు.
మరోవైపు, ఆయన రాజకీయ వారసుడిగా కుమారుడు పవన్ రెడ్డి రాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రానున్న ఎన్నికల్లో కుమారుడిని ఎన్నికల బరిలోకి దింపనున్నారని చెబుతున్నారు. పవన్ కూడా రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. స్విట్జర్లాండ్, జెనీవాల్లో చదువుకున్న పవన్ కు సినీ ప్రముఖులు, క్రికెటర్లతో మంచి పరిచయాలు ఉన్నాయి.