terrorists: హెచ్చరికలు నిజమయ్యాయి.. పాక్ లో రక్తపాతం సృష్టించిన ఉగ్రవాదులు

  • పెషావర్ లో ఎన్నికల ర్యాలీపై ఆత్మాహుతి దాడి
  • ప్రముఖ నేత హరూన్ బిలౌర్ దుర్మరణం
  • ఉగ్రదాడిని ఖండించిన ఇమ్రాన్ ఖాన్

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వివిధ పార్టీల నేతలపై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందంటూ పాకిస్థాన్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం అథారిటీ జారీ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయి. పెషావర్ లో ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు. అవామీ నేషనల్ పార్టీ నిర్వహించిన ర్యాలీపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ప్రముఖ నేత హరూన్ బిలౌర్ తో పాటు, 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 65 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిపై తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, ఉగ్రదాడిని ఖండిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న రాజకీయ నేతలు, అభ్యర్థులకు పటిష్టమైన భద్రతను కల్పించాలని కోరారు.

పాకిస్థాన్ లో ఈనెల 25న సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో తన మద్దతుదారులను ఉద్దేశించి హరూన్ బిలౌర్ ప్రసంగించేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే... ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. 2013 ఎన్నికల సమయంలో కూడా అవామీ నేషనల్ పార్టీని టార్గెట్ గా చేసుకుని తాలిబన్లు పెద్ద ఎత్తున దాడులకు తెగబడ్డారు. 

More Telugu News