motkupalli: నా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు చెపితే... రాజకీయాలను వదిలేస్తా: మోత్కుపల్లి

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక్కో రాజ్యసభ సీటును రూ. 100 కోట్లకు అమ్ముకున్న ఘనత చంద్రబాబుదని ఆయన ఆరోపించారు. ఏ తప్పూ చేయని తనను మోసం చేశారని మండిపడ్డారు. తానేం అన్యాయం చేశానో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు చెబితే... రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెబుతానని అన్నారు.

చంద్రబాబు చేస్తున్నది ధర్మ పోరాటం కాదని... అధర్మ పోరాటమని మోత్కుపల్లి దుయ్యబట్టారు. చంద్రబాబు వైఖరిని తప్పుబడుతూ, రానున్న ఎన్నికల్లో ఆయన ఓడిపోవాలనే కోరికతో తిరుమల వేంకటేశ్వరుడి దర్శనానికి మోత్కుపల్లి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తిరుపతిలో అంబేద్కర్, జగ్జీవన్ రామ్, పూలే, ఎన్టీఆర్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు. 
Go Back to Shorts
motkupalli
Chandrababu

More Telugu News