venkatesh: వెంకీ .. చైతూ మల్టీ స్టారర్ మూవీ లాంచ్

  • అనిల్ రావిపూడితో వెంకటేశ్ 
  • నెక్స్ట్ మల్టీ స్టారర్ మూవీ బాబీతో 
  • మరో హీరోగా నాగచైతన్య  

ఒక వైపున వెంకటేశ్ .. వరుణ్ తేజ్ తో కలసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక 'మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి 'ఎఫ్ 2' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక కొంతసేపటి క్రితం ఆయన మరో మల్టీస్టారర్ మూవీ లాంచ్ అయింది. హైదరాబాద్ .. రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది.

బాబీ దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాలో మరో హీరోగా నాగచైతన్య నటిస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమయ్యే ఈ సినిమాలో, చైతూ జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపిక అయింది. వెంకీ సరసన ఎవరు చేయనున్నారనే విషయంలో స్పష్టత రావలసి వుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారు. దీనికి 'వెంకీ మామ' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు. చందూ మొండేటితో 'సవ్యసాచి' .. మారుతితో 'శైలజా రెడ్డి అల్లుడు' చేస్తోన్న చైతూ, ఈ రెండు సినిమాలతో ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం.

More Telugu News