amit shah: నీలాంటి టెర్రరిస్టును తమిళగడ్డ రానివ్వదు: అమిత్ షాపై నిప్పులు చెరిగిన తంబీలు

  • ప్రజాస్వామ్య గ్యాంబ్లర్ ను మేము రానివ్వం
  • నోట్ల రద్దు స్కామ్ స్టార్.. గో బ్యాక్
  • తమిళనాడు అంటే ఇండియా కాదు

తమిళనాడు పర్యటన కోసం చెన్నై వచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై తమిళ తంబీలు విరుచుకుపడ్డారు. 'గో బ్యాక్ అమిత్ షా' హ్యాష్ ట్యాగ్ తో నెటిజెన్లు నిప్పులు చెరిగారు. ట్వీట్లు, రీట్వీట్లతో ఈ హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండింగ్ అయింది. ఏకంగా 1.30 లక్షల మంది దీని ద్వారా స్పందించారు. ఇండియా ట్విట్టర్ ట్రెండ్స్ లో ఈ హ్యాష్ ట్యాగ్ నెంబర్ 2గా నిలిచింది.

అమిత్ షాపై నెటిజెన్లు చేసిన కామెంట్లు ఈ విధంగా ఉన్నాయి.

  • తమిళగడ్డ సమానత్వానికి ప్రతీక... నీలాంటి టెర్రరిస్టులను ఈ గడ్డ రానివ్వదు.
  • ప్రజాస్వామ్య గ్యాంబ్లర్ ను మేము రానివ్వం.
  • తమిళనాడు అంటే ఇండియా కాదు.
  • ట్యూటికోరిన్ కాల్పులపై నీవు ఎందుకు స్పందించలేదు? జాతీయ పార్టీ అధ్యక్షుడిగా నీకు బాధ్యత లేదా?
  • నోట్ల రద్దు స్కామ్ స్టార్ అమిత్ షా.. గో బ్యాక్

ఇలాంటి వ్యాఖ్యలతో నెటిజెన్లు అమిత్ షాపై తమ కోపాన్ని ప్రదర్శించారు. నెటిజన్ల స్పందనతో తమిళ బీజేపీ నేతలకు ముచ్చెమటలు పట్టాయి.

More Telugu News