Butta Renuka: అభిప్రాయ భేదాలతోనే జగన్ కు దూరమయ్యా!: బుట్టా రేణుక

  • ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్రం 
  • రైల్వే జోన్ ఇవ్వలేదు 
  • మరోసారి గెలిచి తీరుతానన్న బుట్టా

కర్నూలు ప్రాంతంలోని క్షేత్ర స్థాయి నేతలు, కార్యకర్తలతో తనకు ఎటువంటి విభేదాలు లేవని, మరోసారి గెలిచి ఇక్కడి ప్రజలకు సేవ చేసుకుంటానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి ఆపై తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఆమె, ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, వైఎస్ జగన్ కు, ఆయన పార్టీకి ఎందుకు దూరమయ్యారన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

కొన్ని అంశాల్లో అభిప్రాయ భేదాలు వచ్చాయని, అందువల్లే ఆ పార్టీకి దూరమయ్యానని ఆమె వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై కేంద్రం ఎంతో అన్యాయం చేసిందన్న ఆవేదనను వ్యక్తం చేసిన ఆమె, విశాఖపట్నానికి రైల్వే జోన్ విషయంలోనూ అదే వైఖరిని అవలంబించిందని విమర్శించారు. వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని బుట్టా రేణుక వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News