Salman Khan: భర్త, పిల్లలతో కలసి సల్మాన్ ను కలసిన రంభ!

  • ప్రస్తుతం అమెరికాలో ఉన్న సల్మాన్
  • 'జుడ్వా' చిత్రంలో కలసి నటించిన రంభ, సల్మాన్
  • సోషల్ మీడియాలో అలరిస్తున్న నాటి జంట
తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించి, ఆపై వివాహం చేసుకుని నటనకు దూరమై విదేశాల్లో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న రంభ గుర్తుందా? ప్రస్తుతం తన దబాంగ్ టూర్ లో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న సల్మాన్ ఖాన్ ను రంభ తన భర్త, పిల్లలతో వచ్చి కలువగా, ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ లో 1997లో వచ్చిన 'జుడ్వా' చిత్రంలో, ఆ మరుసటి సంవత్సరం వచ్చిన 'బంధన్' చిత్రంలో సల్మాన్, రంభ కలసి నటించిన సంగతి తెలిసిందే. ఈ టూర్ లో కత్రినా కైఫ్, సోనాక్షీ సిన్హా, ప్రభు దేవా తదితరులు ఉండగా, వారందరినీ కలసిన రంభ, ఆ ఫొటోలతో తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాను నింపేసింది. రంభ కుమార్తె అచ్చం అమెలానే ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Salman Khan
Rambha
USA
Da-Bang Tour

More Telugu News