Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • లండన్ లో షూటింగ్ చేస్తున్న రకుల్
  • 'రోబో' సీక్వెల్ రిలీజ్ డేట్ ప్రకటించిన శంకర్ 
  • 'ఎఫ్ 2'లో జాయిన్ అయిన హీరోయిన్లు 
  • బర్త్ డేకి మహేశ్ ఫస్ట్ లుక్ 

 *  కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ తన తాజా హిందీ చిత్రం షూటింగును నిన్న ప్రారంభించింది. అక్షయ్ కుమార్ హీరోగా అఖివ్ అలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ లండన్ లో మొదలైంది.
* రజనీకాంత్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రోబో' సీక్వెల్ 2.O విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో దర్శకుడు శంకర్ ఈ చిత్రం తాజా రిలీజ్ డేట్ ను ప్రకటించాడు. ఈ ఏడాది నవంబర్ 29న చిత్రాన్ని కచ్చితంగా రిలీజ్ చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నాడు.
*  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎఫ్ 2' చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. హీరోయిన్లు తమన్నా, మెహ్రీన్ నిన్న ఈ చిత్రం షూటింగులో జాయిన్ అయ్యారు. తొలి షెడ్యూలు ఈ నెల 21 వరకు జరుగుతుంది.
*  మహేశ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా డెహ్రాడూన్ లో జరుగుతోంది. కాగా, ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను మహేశ్ జన్మదినం రోజున అంటే ఆగస్టు 9న విడుదల చేస్తారట. 

  • Loading...

More Telugu News