thailand: ఎట్టకేలకు థాయ్‌లాండ్‌లోని గుహలోంచి బయటకు వచ్చిన బాలురు

  • కొన్ని రోజులుగా సాహసోపేత ఆపరేషన్‌
  • ప్రస్తుతం ఆసుపత్రిలో బాలురు
  • ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం 
  • చూడడానికి వారి తల్లిదండ్రులకు అనుమతివ్వని అధికారులు

గత నెల 23న థాయ్‌లాండ్‌లోని ఓ గుహలో 12 మంది బాలురు, వారి ఫుట్‌బాల్‌ కోచ్‌ చిక్కుకున్న విషయం తెలిసిందే. రెండు వారాలకు పైగా అందులోనే ఉన్న వారంతా ఎట్టకేలకు సురక్షితంగా బయటకు వచ్చారు. సాహసోపేతమైన మిషన్‌ చేపట్టిన సహాయక బృందాలు నిన్న, మొన్న కొందరిని బయటకు తీసుకొచ్చారు. మిగిలిన వారందరినీ ఈరోజు తీసుకొచ్చి ప్రత్యేక అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

బాలురకు ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారిని కలిసేందుకు వారి తల్లిదండ్రులకు అనుమతి ఇవ్వడం లేదని అన్నారు. ఆసుపత్రిలో ఉన్న వారిని థాయ్‌లాండ్‌ ప్రధానమంత్రి ప్రయుత్‌ చాన్‌-ఓచా కూడా కలిసి పరామర్శించారు. కాగా రెండు వారాల క్రితం తామ్ లుయాంగ్‌ గుహ చూడడానికి  12 మంది బాలురు, వారి ఫుట్‌బాల్‌ కోచ్‌ వెళ్లగా వరద ఉద్ధృతి ధాటికి వారంతా అందులోనే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త హాట్‌ టాపిక్‌గా నిలిచింది. 

More Telugu News