homo sexuals: స్వలింగ సంపర్కం హిందుత్వకు వ్యతిరేకం: సుబ్రహ్మణ్యస్వామి

  • స్వలింగ సంపర్కం నుంచి జనాలు బయటపడేందుకు రీసర్చ్ జరగాలి
  • హోమో సెక్సువల్స్ కు మద్దతు పలకవద్దు
  • ఈ పిటిషన్ ను విస్తృత ధర్మాసనం విచారించాలి
స్వలింగ సంపర్కం సహజమైన ప్రక్రియ కాదని, హిందుత్వకు పూర్తిగా వ్యతిరేకమని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. స్వలింగ సంపర్కం నుంచి జనాలు బయటపడేందుకు మెడికల్ రీసర్చ్ ద్వారా మార్గాలు వెతకాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వలింగ సంపర్కం అనేది హర్షించదగ్గది కాదని, వారికి మద్దతు పలకడం సరైన చర్య కాదని చెప్పారు. స్వలింగ సంపర్కులను క్రిమినల్స్ గా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377పై మరోసారి వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం సిద్ధమైన తరుణంలో స్వామి ఈ మేరకు స్పందించారు. సాధారణ ధర్మాసనం కాకుండా... ఏడుగురు లేదా తొమ్మిది మందితో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్ కు సంబంధించిన వాదనలను వింటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
homo sexuals
subrahmanian swamy
Supreme Court

More Telugu News