allu sirish: నా తొలి హీరోయిన్ ని కలిశా: హీరో అల్లు శిరీష్

  • ముంబైలో యామీ గౌతమ్ ని కలిశా
  • నా తొలి సహనటి కదా, నాకు ఎప్పుడూ ప్రత్యేకమే
  • ఓ సెల్ఫీ పోస్ట్ చేసిన శిరీష్
అల్లు శిరీష్ హీరోగా టాలీవుడ్ కు పరిచయమైన తొలి చిత్రం ‘గౌరవం’. ఈ చిత్రంలో శిరీష్ కు జంటగా బాలీవుడ్ భామ యామీ గౌతం నటించింది. ప్రస్తుతం ముంబైలో ఉన్న అల్లు శిరీష్, తన తొలి హీరోయిన్ ని కలిశాడు. ఆమెతో కలిసి ఓ సెల్ఫీ దిగాడు. ఈ సెల్ఫీని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన అల్లు శిరీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ముంబైలో యామీ గౌతమ్ ని కలిశాను. నా తొలి సహనటి కదా, అందుకే, ఆమె అంటే ఎప్పుడూ ప్రత్యేకమే’ అని ట్వీట్ చేశాడు. కాగా, మలయాళ రీమేక్ చిత్రం ‘ఏబీసీడీ’లో అల్లు శిరీష్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
allu sirish
yami gowtham

More Telugu News