bellamkonda srinivas: కథ అంతా కాజల్ చుట్టూనే తిరుగుతుందట!

  • తేజ దర్శకత్వంలో కాజల్
  • నాయిక ప్రాధాన్యత కలిగిన కథ 
  • త్వరలోనే టైటిల్ ప్రకటన
తెలుగు తెరపై అందాల కథానాయికగా కాజల్ కావాల్సినన్ని మార్కులను సంపాదించుకుంది. కొన్ని సినిమాలు నటిగా ఆమె సాధించిన పరిణతికి నిదర్శనంగా నిలుస్తూ కనిపిస్తాయి. అలాంటి కాజల్ తాజాగా తేజ దర్శకత్వంలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కథానాయికగా చేస్తుందని అనుకున్నారు.

అయితే ఇది కథానాయిక ప్రాధాన్యత కలిగిన కథ అనేది తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తోన్న టాక్. కథ అంతా కూడా కాజల్ చుట్టూనే తిరుగుతుందట. ఆమెను సపోర్ట్ చేసే పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తాడని అంటున్నారు. కథ ప్రకారం ఈ సినిమాకి నాయిక పేరునే టైటిల్ గా పెట్టాలనే ఆలోచన చేస్తున్నారట. త్వరలోనే టైటిల్ ను ఎనౌన్స్ చేసి .. ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. ఈ సినిమాతో కాజల్ కి మరింత మంచిపేరు రావడం ఖాయమని చెప్పుకుంటున్నారు.       
bellamkonda srinivas
kajal

More Telugu News