shakalaka shankar: ఇంట్లో వాళ్లంతా నేను పోయాననే అనుకున్నారు: షకలక శంకర్

  • 'మంజునాథ' షూటింగు సమయంలో వచ్చాను 
  • ఇక్కడే అవకాశాల కోసం ట్రై చేయడం మొదలుపెట్టాను
  • 8 సంవత్సరాల పాటు మా వాళ్లకు కనపడలేదు

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో షకలక శంకర్ మాట్లాడుతూ తాను సినిమా పరిశ్రమలోకి ఎలా వచ్చిందీ చెప్పుకొచ్చాడు. "చిరంజీవిగారి మంజునాథ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతూ ఉండగా, బొమ్మలు గీయడం కోసం నేను 'మాయా' డిపార్టుమెంటులో పనిలో చేరాను. 20 రోజుల తరువాత నాతో వచ్చిన వాళ్లంతా వెనక్కి వెళ్లిపోయారు. నేను మాత్రం సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఇక్కడే వుండిపోయాను.

అలా 2001లో వచ్చిన నేను 2008 వరకూ ఇంటికి వెళ్లలేదు. నా కోసం మా అమ్మ .. నాన్నలు స్వామీజీల దగ్గరికి వెళితే, 'అంజనం' వేసి చూసి నేను చనిపోయానని చెప్పారట. దాంతో నిజంగానే నేను పోయాననుకుని మా వాళ్లు నా ఫోటోకి దండేశారు. ఆ  తరువాత 'నోట్ బుక్' సినిమాలో మొదటిసారిగా నటించే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా షూటింగు కోసం రామచంద్రాపురం' వెళితే అక్కడ నన్ను మా నాన్న చూశాడు" అంటూ చెప్పుకొచ్చాడు.     

  • Loading...

More Telugu News