Dharmagraha Yatra: పరిపూర్ణానంద స్వామిని ఇంకా బయటకు వదలని పోలీసులు!
- ధర్మాగ్రహ యాత్ర తలపెట్టిన పరిపూర్ణానంద
- యాత్రకు అనుమతి లేదని తేల్చి చెబుతున్న పోలీసులు
- ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు అనుమతి నిరాకరణ
శ్రీరాముడిపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్మాగ్రహ యాత్రను తలపెట్టిన శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి గృహ నిర్బంధం ఇంకా కొనసాగుతోంది. తాను యాత్ర చేసి తీరుతానని పరిపూర్ణానంద భీష్మించుకుని కూర్చోగా, అనుమతి లేదని చెప్పిన పోలీసులు, నిన్న రాత్రి ఆయన్ను మింట్ కాంపౌండ్ లోని ఆంజనేయస్వామి ఆలయం వరకూ మాత్రం వెళ్లనిచ్చారు. ఆలయం నుంచి తిరిగి ఆయన్ను ఇంటికి చేర్చిన పోలీసులు, ఈ ఉదయం కూడా ఆయన్ను బయటకు కదలనీయలేదు.
ఇదిలావుండగా, నిన్న చోటు చేసుకున్న పరిణామాల తరువాత పరిపూర్ణానంద సహా 25 మందిపై ఐపీసీ సెక్షన్ 151 కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయిన రాహుల్ అనే యువకుడిపై ఐపీసీ సెక్షన్ 309 కింద కేసు పెట్టి విచారణ జరుపుతున్నారు.