Kathi Mahesh: 'ఎలా వచ్చాయ్‌.. నీకు ఆ మాటలు?'.. కత్తి మహేశ్‌పై హైపర్‌ ఆది విమర్శలు.. వీడియో వైరల్‌

  • పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నాడు
  • మనుషుల మధ్యే కాకుండా దేవుడి మీద కూడా రివ్యూలు రాస్తున్నాడు
  • మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు

జబర్దస్త్ కార్యక్రమంలో 'హైపర్‌' ఆది విసిరే పంచులకు సంబంధించిన వీడియోలు యూ ట్యూబుల్లోనూ లక్షలాది క్లిక్స్‌తో దూసుకెళుతాయన్న విషయం తెలిసిందే. తాజాగా, కత్తి మహేశ్‌పై హైపర్‌ ఆది పోస్ట్ చేసిన విమర్శలకు చెందిన ఓ వీడియో కూడా అంతే వైరల్‌ అవుతోంది. కొన్ని కోట్ల మంది కొలిచే రాముడిని తీసుకొచ్చి కత్తి మహేశ్‌ న్యూస్‌ ఛానెళ్లలో కూర్చోబెట్టేశాడని ఆయన అన్నాడు.

రాముడిని అలా అనడానికి ఆయనకు ఆ మాటలు ఎలా వచ్చాయని హైపర్ ఆది నిలదీశాడు. తనకు క్రిష్టియన్స్‌, ముస్లిం ఫ్రెండ్స్‌ ఉన్నారని, వారి పండుగలకు వాళ్లింటికి వెళ్లి భోజనం చేస్తానని, సంక్రాంతి వస్తే వాళ్లు తమ ఇంటికి వచ్చి భోజనం చేస్తారని అన్నాడు. ఇలా ఐకమత్యంగా ఉండే మనదేశంలో కొందరు మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించాడు. పబ్లిసిటీ కోసం మనుషుల మధ్యే కాకుండా దేవుడి మీద కూడా కత్తి మహేశ్ రివ్యూలు రాస్తున్నాడని హైపర్‌ ఆది అన్నాడు.                    

  • Loading...

More Telugu News