అంత బిజీయా?... కారులోనే ట్రిమ్మింగ్ చేసుకుంటున్న వెన్నెల కిశోర్ వీడియో!

09-07-2018 Mon 11:30
  • సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో 
  • ఇంటి వద్ద మేకప్ వేసుకునే సమయం లేకపోయిందట
  • వైరల్ అవుతున్న వీడియో
నటుడు వెన్నెల కిశోర్ తన తాజా వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, దాన్ని చూసిన వారంతా 'మనోడు అంత బిజీయా?' అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ హీరోగా, శ్రీను వైట్ల తీస్తున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రంలో నటిస్తున్న వెన్నెల కిశోర్, ఇంటి వద్ద గడ్డం ట్రిమ్ చేసుకునే సమయం లేక పోవడంతో, కారులో షూటింగ్ కు వెళుతూ పనికానిచ్చేశాడు.

షూటింగ్ అనుకున్న సమయంకన్నా పావుగంట ముందుకు జరగడంతో ఈ పని చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఇంటి వద్ద మేకప్ కు తనకు సమయం లేకపోయిందని, అందువల్లే కారులో ట్రిమ్మింగ్ చేసుకుంటున్నానని చెప్పాడు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.