జెమినీ గణేశన్ చెప్పినట్టుగానే హీరోయిన్ అయ్యాను: కేఆర్ విజయ

  • మా నాన్నగారు ఆర్మీలో పనిచేసేవారు 
  • ఆయనకి సినిమాలంటే చాలా ఇష్టం 
  • నన్ను హీరోయిన్ ను చేయాలనుకునేవారు
తెలుగు తెరపై అందాల తారగా మనసుదోచుకున్న అలనాటి కథానాయికలలో ఒకరిగా కేఆర్ విజయ కనిపిస్తారు. తాజాగా ఆమె 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించారు. "మా నాన్నగారు ఆర్మీలో పనిచేసేవారు .. ఆయనకి సినిమాలంటే ఇష్టం. సినిమాల్లో నాతో నటింపజేయాలనేది మా నాన్నగారి ఆశ.

ఆయన ప్రోత్సాహం వలన నేను డ్రామాల్లో నటిస్తూ ఉండేదానిని. ఆ సమయంలోనే మేము మద్రాసు వచ్చాం. అక్కడ జరిగిన ఒక ఫంక్షన్ లో నన్ను జెమినీ గణేశన్ గారు చూశారు. అప్పటికి నాకు 13 .. 14 సంవత్సరాలు వుంటాయేమో. ఈ అమ్మాయి చాలా బాగుంది ..  పెద్ద హీరోయిన్ అవుతుందని ఆయన అప్పుడు చెప్పారు. ఆ తరువాత రెండేళ్లకే నాకు తమిళంలో ఆయనతో కలిసి 'కర్పగం' సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అదే సినిమా తెలుగులో 'తోడు నీడ'గా వచ్చింది" అని ఆమె చెప్పుకొచ్చారు.    
Go Back to Shorts
kr vijaya
gemini ganeshan

More Telugu News