Hyderabad: స్వామి పరిపూర్ణానంద హౌస్ అరెస్ట్... భారీగా పోలీసుల మోహరింపు!

  • పరిపూర్ణానందను ఇల్లు కదలనివ్వని పోలీసులు
  • జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటివద్ద భారీ సంఖ్యలో పోలీసులు
  • యాత్రకు అనుమతి లేదని చెబుతున్న పోలీసు అధికారులు
కత్తి మహేష్ పై చర్యలకు డిమాండ్ చేస్తూ, నేడు యాదగిరిగుట్టకు పాదయాత్ర చేయనున్నానని ప్రకటించిన శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిని జూబ్లీహిల్స్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బషీర్ బాగ్ లోని భాగ్యలక్ష్మీ గుడికి ఆయన బయలుదేరగా, ఇంటి వద్దనే అడ్డుకున్న పోలీసులు, ఆయన్ను గడప దాటనీయలేదు.

జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి భారీ సంఖ్యలో చేరుకున్న పోలీసులు, పాదయాత్రకు అనుమతి లేదని, యాత్రతో శాంతిభద్రతల సమస్య ఏర్పడవచ్చని, అందువల్ల యాత్రను కొనసాగనివ్వలేమని స్పష్టం చేశారు. శ్రీరాముడు ఓ దగుల్బాజీ అంటూ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు హిందువులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించగా, ఆయనపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. ఆయన్ను అరెస్ట్ చేయాలని కోరుతూ ధర్మాగ్రహం పేరిట పరిపూర్ణానంద పాదయాత్రను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Hyderabad
Police
Jublee Hills
Paripoornananda

More Telugu News