Balakrishna: రెండో మనవడికి పేరు పెట్టిన బాలయ్య.. ట్వీట్ చేసిన లోకేశ్!

  • మార్చిలో బాబుకు జన్మనిచ్చిన తేజశ్విని 
  • ఆర్యవీర్‌గా నామకరణం
  • శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన రెండో మనవడికి పేరు నిర్ణయించారు. బాలయ్య రెండో కుమార్తె తేజశ్విని-శ్రీభరత్ దంపతులకు మార్చి 22న పండంటి మగ బిడ్డ జన్మించాడు. తాజాగా ఈ బాబుకు ఆర్యవీర్ అని నామకరణం చేసినట్టు బాలయ్య పెద్దల్లుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. శ్రీభరత్-తేజశ్వినిలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్, ఇలాంటి తల్లిదండ్రులను పొందడం ఆర్యవీర్ అదృష్టమని పేర్కొన్నారు.  

More Telugu News