amarnath: అమర్‌నాథ్‌ యాత్రలో ఇద్దరు తెలుగు యాత్రికులు మృతి!

  • బాల్తాల్‌ బేస్‌క్యాంప్‌ వద్ద గుండెపోటుతో లక్ష్మీ బాయి(54) మృతి
  • అస్వస్థతకు గురైన ఏపీకి చెందిన రవీంద్రనాథ్‌ (72)
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి
అమర్‌నాథ్ యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. అనారోగ్య కారణాలతో ఇద్దరు తెలుగు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. బాల్తాల్‌ బేస్‌క్యాంప్‌ వద్ద గుండెపోటుతో హైదరాబాద్‌ వాసి లక్ష్మీ బాయి (54) మృతి చెందారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రవీంద్రనాథ్‌ (72) అనే యాత్రికుడు అస్వస్థతకు గురవడంతో ఆయనను శ్రీనగర్‌లోని స్కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. జమ్ముకశ్మీర్‌లో కురుస్తున్న వర్షాలతో ఇటీవల అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. వర్షాలు తగ్గాక యాత్రికులను అనుమతించారు.
amarnath
pilgrims

More Telugu News