hindu: హిందూ ధర్మంపై జరుగుతోన్న దాడులకు నిరసనగా.. రేపటి నుంచి స్వామి పరిపూర్ణానంద యాత్ర

  • 'ధర్మాగ్రహ యాత్ర' పేరిట నిరసన
  • బోడుప్పల్‌ నుంచి యాదగిరిగుట్ట వరకు యాత్ర
  • మూడు రోజుల పాటు కొనసాగనున్న యాత్ర
హిందూ ధర్మంపై జరుగుతోన్న దాడులకు నిరసనగా రేపటి నుంచి శ్రీ పీఠం అధిపతి, రాష్ట్రీయ హిందూ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి పరిపూర్ణానంద 'ధర్మాగ్రహ యాత్ర' ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌ శివారులోని బోడుప్పల్‌ నుంచి యాదగిరిగుట్ట వరకు మూడు రోజుల పాటు ఆ యాత్ర కొనసాగనుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ... హిందూ ధర్మంపై పెచ్చుమీరుతున్న కుట్రలను, మేధావుల ముసుగులో విచ్ఛిన్నకర శక్తులను ఇంకా ఎన్నాళ్లు భరించాలని, ఎన్నేళ్లు సహించాలని ప్రశ్నించారు. ఆ కుట్రల్ని భగ్నం చేసేందుకే ఈ ధర్మాగ్రహ యాత్ర అని అన్నారు. రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌పై స్వామి పరిపూర్ణానంద మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.         
hindu
swami paripoornananda
Hyderabad

More Telugu News