Sugar: ప్రముఖ 'షుగర్' డైటీషియన్ వీరమాచనేని తల్లి కన్నుమూత... భౌతిక కాయాన్ని ఆసుపత్రికి ఇవ్వాలని నిర్ణయం!

  • తన సలహాలతో ఫేమస్ అయిన వీరమాచనేని రామకృష్ణ
  • ఈ ఉదయం గుండెపోటుతో మృతిచెందిన సరోజిని
  • పిన్నమనేని ఆసుపత్రికి మృతదేహాన్ని ఇస్తానన్న తనయుడు 

 తన వీడియోలు, యూట్యూబ్ సలహాలు, టీవీ చానళ్ల ప్రసంగాలతో వేలాది మంది మధుమేహ వ్యాధిగ్రస్తుల రోజువారీ ఆహారాన్ని మార్చిన వీరమాచనేని రామకృష్ణ తల్లి ఈ ఉదయం కన్నుమూయగా, ఆమెకు అంతిమ సంస్కారాలను చేయబోనని ఆయన ప్రకటించారు. గుండెపోటుతో మృతి చెందిన తల్లి వీరమాచనేని సరోజిని (75) భౌతిక కాయాన్ని దహనం చేయడం లేదా ఖననం చేయడాన్ని తాను అంగీకరించనని, రేపు విజయవాడ పిన్నమనేని ఆసుపత్రికి భౌతికకాయాన్ని తన కుటుంబీకులతో కలసి వెళ్లి అప్పగిస్తానని ఆయన తెలిపారు.  

  • Loading...

More Telugu News