USA: అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య... నిందితుడిని పట్టిస్తే 10 వేల డాలర్ల బహుమతి!

  • కన్సాస్ రెస్టారెంట్ లో ఘటన
  • రివార్డు ప్రకటించిన అమెరికా పోలీసులు
  • మృతదేహం తరలింపుకు ఏర్పాట్లు  
అమెరికాలోని కన్సాస్ నగరంలోని ఓ రెస్టారెంట్ లో పనిచేస్తూ, దారుణ హత్యకు గురైన తెలుగు విద్యార్థి కొప్పు శరత్ ను కాల్చిన అనుమానితుడి వీడియోను పోలీసులు విడుదల చేశారు. పొడవాటి వెంట్రుకలు, చారల టీ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్, వైట్ షూస్ ధరించిన ఓ యువకుడు, చేత్తో టవల్ పట్టుకుని, దాని వెనుక గన్ ఉంచుకుని రెస్టారెంట్ లో అటూ, ఇటూ తిరుగుతూ ఉండటం ఈ వీడియోలో కనిపిస్తోంది.

ఇక ఇతని గురించిన వివరాలను తమకు తెలియజేస్తే 10 వేల డాలర్ల రివార్డును అందిస్తామని యూఎస్ పోలీసులు ప్రకటించారు. శరత్ మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా ఇండియాకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. కాగా, వరంగల్ లో ఉన్న శరత్ కుటుంబాన్ని ఆదుకునేందుకు చౌడవరం రఘు అనే యువకుడు 'క్రౌడ్ ఫండింగ్'  ప్రచారాన్ని ప్రారంభించగా, నిన్న ఒక్కరోజులో 45 వేల డాలర్లకు పైగా వసూలయ్యాయి.
USA
Cansas
Murder
Telangana
Student
Suspect

More Telugu News