Jayachitra: నా ఇంటి కోసం చేతబడి ప్రయోగిస్తున్నారు: నటి జయచిత్ర సంచలన ఆరోపణలు

  • 12 ఏళ్లుగా అద్దె చెల్లించడం లేదు
  • కోర్టు ఆదేశించినా ఖాళీ చేయడం లేదు
  • ఇంటి చుట్టూ క్షుద్ర పూజలు చేస్తున్నారు 
చెన్నైలోని తన ఇంటిని కాజేసేందుకు ఇలం మురుగన్ అనే వ్యక్తి చేతబడి, బాణామతిని ప్రయోగిస్తున్నాడని సీనియర్ నటి జయచిత్ర సంచలన ఆరోపణలు చేశారు. గత 12 సంవత్సరాలుగా తన ఇంట్లో అద్దెకు ఉంటూ, ఖాళీ చేయకుండా ఇబ్బందులు పెట్టిన ఆయన, కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు.

రంగరాజపురంలో మీడియాతో మాట్లాడిన ఆమె, ఇలం మురుగన్, మీనా దంపతులు తనకు రూ. 7 లక్షల వరకూ అద్దె బకాయి ఉన్నారని తెలిపారు. ఇల్లు ఖాళీ చేసేందుకు ఈ నెల 20 వరకూ కోర్టు గడువు ఇచ్చిందని వెల్లడించిన ఆమె, తన ఇంటి చుట్టూ క్షుద్ర పూజలు చేస్తున్నారని, దాన్ని అపహరించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఓ ఫైనాన్షియర్ ను మోసం చేసిన కేసులో మురుగన్ సెంట్రల్ జైలులో ఉన్నారని, 20వ తేదీన పోలీసుల సాయంతో తన ఇంటిని స్వాధీనం చేసుకోనున్నానని తెలిపారు.
Jayachitra
House
Rent
Court
Chennai

More Telugu News