Ravidra Bharathi: నేడు రవీంద్ర భారతిలో నవ్వులు పండించనున్న 40 మంది సినీ హాస్య నటులు

  • రవీంద్రభారతిలో నేటి ఉదయం నుంచి నాన్‌‌ స్టాప్ నవ్వులు
  • ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమం
  • సీనియర్ నటులు, దర్శకులకు సన్మానం

హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నేడు 40 మంది సినీ హాస్యనటులు నవ్వులు పండించనున్నారు. ఆలూరు ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆద్వరంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా నవ్వులు విరబూయనున్నాయి. నటుడు అశోక్ కుమార్ నేతృత్వంలో హాస్యనటులంతా ఒక చోటకి చేరనుండడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో భాషా, సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని అశోక్ కుమార్ తెలిపారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ విచ్చేస్తారు. ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్, సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావులను సత్కరించనున్నట్టు ఆలూరు సంస్థ వ్యవస్థాపకుడు అశోక్‌కుమార్ తెలిపారు. కార్యక్రమానికి నగర మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి, ఎస్.వేణుగోపాలచారి, పర్యాటక కార్యదర్శి బి.వెంకటేశం, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, బాబూమోహన్, జేడీ చక్రవర్తి, శ్రీకాంత్, శివాజీరాజా, నరేష్, రాగిణి, గౌతంరాజు, ఉత్తేజ్, పృథ్వీ, సంపూర్ణేష్‌బాబు, శివారెడ్డి, ఝాన్సీ, తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News