Kadiam Srihari: బుద్ధిలేని ఆ బీజేపీ నేత గురించి మాట్లాడను: కడియం శ్రీహరి

  • బీజేపీ నేతపై మండిపడ్డ కడియం 
  • రాంమాధవ్ కు బుద్ధిలేదు
  • జాతీయ స్థాయి నాయకుడై ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? 
టీఆర్ఎస్ నేతలపై  బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాంమాధవ్ కు బుద్ధిలేదని, అటువంటి బీజేపీ నేత గురించి మాట్లాడేందుకు తన సంస్కారం అడ్డువస్తోందని అన్నారు. జాతీయ స్థాయి నాయకుడై ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, విమర్శలు చేసే ముందు బీజేపీ నేతలు ఉపయోగించే భాష సవ్యంగా ఉండేలా చూసుకోవాలని, లేకపోతే ప్రజలే తగినబుద్ధి చెబుతారని అన్నారు.
Kadiam Srihari
ram madhav

More Telugu News