bjp: బీజేపీ, టీఆర్ఎస్ లు అనాగరిక భాషను మానుకోవాలి: రావుల చంద్రశేఖర్ రెడ్డి

  • టీడీపీ ఓట్ల వల్లే తెలంగాణలో బీజేపీకి ఐదు సీట్లు వచ్చాయి
  • తెలుగు ప్రజలను బీజేపీ వెన్నుపోటు పొడిచింది
  • బీజేపీ రాజకీయాలను దేశ ప్రజలంతా గమనిస్తున్నారు

వివిధ సందర్భాల్లో బీజేపీ, టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న భాష సరిగా లేదని... అనాగరిక భాషను ఈ రెండు పార్టీల నేతలు మానుకోవాలని టీటీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. టీడీపీ ఓట్ల వల్లే తెలంగాణలో బీజేపీకి ఐదు సీట్లు వచ్చాయని, ఆ విషయాన్ని ఆ పార్టీ నేతలు మర్చిపోవద్దని సూచించారు.

ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బీజేపీ వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. బీజేపీ రాజకీయాలను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. జీఎస్టీ, నోట్ల రద్దు వల్ల ప్రజల ఇబ్బందులు మరింత పెరిగాయని అన్నారు. బీజేపీ పాలనలో ఆర్థిక నేరాలు పెరిగాయని చెప్పారు. 

More Telugu News